Oct 17,2023 20:37

ఈ-ఆఫీస్‌ విధానం అమలు కావాలి : జెసి

కడప : జిల్లా స్థాయి నుచి గ్రామ సచివాలయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని జెసి, ఇన్‌ఛార్జి కలెక్టర్‌ జి. గణేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ స్పందన హాలులో ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ అమలు, నిర్వహణపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఇప్పటికే ఈ-ఆఫీస్‌ సిస్టమ్‌ ఆచరణలో ఉండగా అన్ని శాఖల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని, ఇక మీదట అన్ని కార్యాలయాల్లో తప్పనిసరిగా ఈ ప్రక్రియ అమలు చేయాలని పేర్కొన్నారు. ఇంకనూ ఆచరణలో లేని శాఖలు అందుకు సంబంధించిన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే సమకూర్చుకోవాలన్నారు. అన్ని శాఖలు జిల్లా స్థాయి నుండి గ్రామ సచివాలయ స్థాయి వరకు ఈ-ఆఫీస్‌ విధానాన్ని పక్కాగా ఆచరణలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.