
ప్రజాశక్తి-గణపవరం : పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) అన్నారు. సోమవారం క్రొత్తపల్లి జరిగిన. ఇళ్ళపట్టాల కార్యక్రమంలో పాల్గుని మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సబకి గ్రామసర్పంచి మద్దాల రత్నకుమారి అద్యక్షత వహించారు.సబలోవాసుబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమలు చేస్తున్నారని చెప్పారు సొంత ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాల అందించి వారి సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు గత ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వ్యవహరించడం వలన ప్రజల అభివృద్ధి కాలేకపోయారని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు కావలసిన అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో రాష్ట్రం నిలిచిందని అన్నారు గ్రామాల్లో అర్హత కలిగిన వారందరికీ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందించడం జరుగుతుందని చెప్పారు కొత్తపల్లి గ్రామంలో ఎప్పటినుండో ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న వారికి వైఎస్సార్ ప్రభుత్వంలో వారి కల నెరవెరినట్లుచెప్పారు. గ్రామంలో104.మందికి ఇళ్ళ పట్టాలందించారు. ఈ కార్యక్రమంలో మండలపరిషత్. అద్యక్షులుదండువెంకటరామరాజు(అర్దవరంరాము).తాశీల్దార్.పమ్మిలక్షి.ఎంపిడిఓ జి.జ్యోతిర్మయి. జడ్.పి.టిసిదేవ వరపుసోమలక్షి. వైయస్సార్ పార్టీ నాయకులు కాకర్ల శ్రీనివాసు దండు రాము గ్రామ సర్పంచులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు