Aug 05,2021 20:10

న్యూఢిల్లీ : దోచుకెళ్లిన 75 శాతం వారసత్వ సంపదను మోడీ హయాంలోనే తిరివి రప్పించగలిగామని కేంద్ర సాంస్కృతిక,, పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌ రెడ్డి చెప్పారు. మన దేశ వారసత్వ సంపదలో దోచుకెళ్లిన అత్యధిక కళాఖండాలు మోడీ పాలనలో తిరిగి భారత్‌కు వచ్చాయని అన్నారు. గురువారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 1976 నుంచి ఇప్పటి వరకు 54 కళాఖండాలను విదేశాల నుండి తిరిగి రప్పించామని, వీటిలో అత్యధికం ఈ ఏడేళ్ళలో వచ్చినవేనని ఆ సమాధానంలో పేర్కొన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు 41 కళాఖండాలను రప్పించినట్లు చెప్పారు. వివిధ దేశాల అధినేతలతో మోడీ వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకుంటున్నారని, ఫలితంగా మన దేశంతో ఇతర దేశాలతో సాంస్కృతిక  సంబంధాలు నిరంతరం మెరుగుపడుతున్నాయని చెప్పారు. నెహ్రూ-గాంధీ కుటుంబ నేతలు సంపదను పోగేసుకోవడంపైనే దృష్టి సారించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 10 కళాఖండాలను మాత్రమే వెనుకకు రప్పించగలిగిందన్నారు.