
ప్రజాశక్తి-పాలకొల్లు : బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో పాలకొల్లులో గురువారం తేలికపాటి భారీ వర్షం పడింది. దీంతో వినాయక మండపంలలో పూజలకు అంతరాయం ఏర్పడింది. పాలకొల్లు పెద్ద సాయిబాబా గుడి, బంగారు వారి చెరువు గట్టు, దిగమర్రు, దగ్గులూరు, శివదేవుని చిక్కాల సాయిబాబా ఆలయంలలో భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. తెల్లవారుజామున కూడా భారీ వర్షం పడింది.దీంతో రోడ్లు చిందరవందరగా ఉన్నాయి.