మెంతికూర లేదా మెంతి గింజలు ఆహారంలో తరచూ వాడటం వల్ల రుచితో పాటు అనేక సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించడంలో, మలబద్ధకం తగ్గించడంలో, చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మెంతులు ఎంతో మేలు చేస్తాయి. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు మెంతికూరలో లభిస్తాయి.
మెంతి తింటే మీకు ఇవి ప్రయోజనాలు
- మెంతులు లేదా మెంతికూర తరచుగా తినడం వల్ల మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
- ఇది జుట్టు రాలడం, నెరిసిన జుట్టును తగ్గిస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
- దగ్గు, ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం, ఊబకాయం వంటి కఫ (Kapha)) వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- పక్షవాతం, మలబద్ధకం, కడుపు నొప్పి, ఉబ్బరం తగ్గించడంలో మెంతి దివ్యౌషధంగా పనిచేస్తుంది.
ఎవరు వాడకూడదు....
ముక్కు సంబంధిత రక్తస్రావ వ్యాధులతో బాధపడుతున్న వారు...
హెవీ పీరియడ్స్ వంటి రక్తస్రావ సమస్యలతో బాధపడుతున్నవారు...
ఇటువంటి రుగ్మతలతో బాధపడేవారు ముఖ్యంగా ఎండాకాలంలో మెంతులను తినకూడదు.
ఎలా వాడచ్చు...
- 1-2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలు రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే తినండి. లేదా టీ లాగా కూడా తాగొచ్చు.
- భోజనానికి ముందు లేదా రాత్రిపూట గోరువెచ్చని పాలు లేదా నీటితో ఒక స్పూన్ మెంతి పొడిని రోజుకి రెండుసార్లు తీసుకోండి.
- మెంతులను పేస్ట్ లా చేసి.. అందులో పెరుగు/కలబంద జెల్/నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం, నెరిసిన జుట్టు వంటి సమస్యలు మటుమాయమవుతాయి.
- రోజ్‌వాటర్‌తో తయారు చేసిన మెంతికూర పేస్ట్‌ని ముఖంపై సున్నితంగా మర్దన చేయడం వల్ల డార్క్ సర్కిల్స్, మొటిమలు, మొటిమల మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. అయితే, వీటిని ఫాలో అయ్యే ముందు ప్రతి ఒక్కరు కూడా తమ ఆయుర్వేదిక్ డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.