Mar 05,2023 00:28

సమావేశంలో మాట్లాడుతున్న పెన్షనర్ల సంఘం నాయకులు

ప్రజాశక్తి-కంచరపాలెం : హయ్యర్‌ పెన్షన్‌ దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో కూడా అనుమతించాలని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పెన్షన్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ డిమాండ్‌చేసింది. ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పెన్షన్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ సమావేశంలో శనివారం హష్మీ భవన్‌లో నిర్వహించారు. పలు అంశాలను చర్చించి తీర్మానాలు చేశారు. ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు వల్ల, ఇపిఎఫ్‌ సర్క్యులర్‌ వల్ల వచ్చిన గందరగోళం నివారించాలని, గ్యాస్‌ ధరను తగ్గించాలని, జివిఎంసి ఇంటి పన్నుతో పాటు చెత్త పన్ను వసూలు చేయడం అపాలని తీర్మానించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్‌ కొరెడ్ల రమాప్రభను అసోసియేషన్‌ మెంబర్స్‌ అందరూ బలపరచి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, ఆమె గెలుపునకు కృషి చేయాలని నిర్ణయించారు. ఈ నెల 19న కాకినాడలో జరిగే ఎపిఆర్‌ పిఎ రెండవ రాష్ట్ర మహా సభను జయప్రదం చేయాలని కోరారు.