
నగదు లెకిస్త్రున్న దృశ్యం
హుండీలోని ఆదాయం లెక్కింపు
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాలెం:ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ జొన్నవాడ కామాక్షితాయి దేవస్థానము నందు మంగళవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం దేవస్థాన చైర్మన్ , పాలక మండలి సభ్యులు, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సమక్షంలో హుండీలు తెరిచి భక్తులు శ్రీవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు. తేదీ 16.08.2023 నుండి తేదీ 07.11.2023 వరకు అనగా 84 రోజులకు గాను శ్రీ వార్ల హుండీలు ద్వారా ఆదాయం రూ. 45, 66,929 సింగపూర్ డాలర్స్ 10, లండన్ (ఇంగ్లాండ్ )పౌండ్స్ 20 బంగారం వస్తువులు 185 గ్రాములు,వెండి వస్తువులు 383 గ్రాములు 100 మిల్లీ గ్రాములు భక్తులు శ్రీవార్ల హుండీ ద్వారా సమర్పించారు. ఈ కార్యక్రమములో దేవస్థాన చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థాన సహాయ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ విరుపావఝ్జుల గిరికష్ణ , పాలకమండలి సభ్యులు, పర్యవేక్షణ అధికారిగా డి చంద్రశేఖర్ రావు, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహనాధికారి, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, మూలపేట, నెల్లూరు నగరం మరియు , స్థానిక ఏపీజీ బ్యాంక్ అధికారులు మరియు బ్యాంక్ అప్రైజర్, ఆలయ సిబ్బంది ,పోలీస్ వారు మరియు విద్యాసాగర్ కష్ణ అధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.