
హుండీ ఆదాయం లెక్కింపు
ప్రజాశక్తి బుచ్చిరెడ్డిపాలెం : జొన్నవాడలోని కామాక్షితాయి దేవస్థానంలో మంగళవారం హుండీలు లెక్కింపు కార్యక్రమాన్ని దేవస్థాన చైర్మన్, పాలక మండలి సభ్యులు, దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు, దేవస్థాన కార్యనిర్వహణాధికారి సమక్షంలో నిర్వహించారు. ఆగస్టు 16వ తేదీ నుండి నవంబర్ 7వతేదీ వరకు అనగా 84 రోజులకు గానూ హుండీల ద్వారా ఆదాయం రూ.45,66,929, సింగపూర్ డాలర్స్ 10, లండన్ (ఇంగ్లాండ్) పౌండ్స్ 20, బంగారం వస్తువులు 185గ్రాములు, వెండి వస్తువులు 383.100 గ్రాములు ఉన్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి విరుపావఝ్జుల గిరికృష్ణ, పాలకమండలి సభ్యులు, పర్యవేక్షణ అధికారిగా డి.చంద్రశేఖర్ రావు, సహాయ కమిషనర్, కార్యనిర్వాహనాధికారి, వేణుగోపాల స్వామి దేవస్థానం, మూలపేట, నెల్లూరు నగరం, స్థానిక ఎపిజి బ్యాంక్ అధికారులు, బ్యాంక్ అప్రైజర్, ఆలయ సిబ్బంది, పోలీస్ వారు, విద్యాసాగర్, కృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌బిఐ రిటైర్డ్ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.