Oct 10,2022 00:05

హుదూద్‌ ఇళ్లను పరిశీలిస్తున్న జివిఎంసి కమిషనర్‌ రాజాబాబు

ప్రజాశక్తి -పిఎం.పాలెం : కొమ్మాది సమీపంలో మా సినీ ఇండిస్టీస్‌ సంస్థ నిర్మించిన హుదూద్‌ ఇళ్లను ఆదివారం జివిఎంసి కమిషనర్‌ పి.రాజాబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బాధితులకు ఈ ఇళ్లలో చికిత్స అందించారని, ప్రస్తుతం ఆ సామగ్రి ఇంకా ఇళ్ల గదులులోనే ఉండిపోవడంతో తక్షణమే వాటిని తరలించే ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. నిరుపయోగంగా ఉన్న ఇళ్లకు సదుపాయాలు కల్పించి త్వరితగతిన లబ్ధిదారులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఇళ్ల కేటాయింపులో ఉన్న సమస్యలను పరిష్కరించి లబ్ధిదారులకు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్క్స్‌ ఎస్‌ఇ శ్యామ్‌సన్‌ రాజు, జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము, భీమిలీ వైసిపి ఇన్‌ఛార్జి ముత్తంశెట్టి మహేష్‌, హౌసింగ్‌ డిఇ, ఎఇ, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పాల్గొన్నారు.