Aug 22,2023 23:47

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : విజయవాడ నుంచి హుబ్లీ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో ఒక బోగిలో మంగళవారం మధ్యాహ్నం పొగలు రావడంతో రైలు దాదాపు 40 నిమిషాలు గుంటూరు రైల్వేస్టేషన్‌లో నిలిచింది. పొగలను గమనించిన ప్రయాణికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకురావడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సాంకేతిక మరమ్మతులు చేసి పొగలను నియంత్రించారు. తరువాత రైలు హుబ్లీకి బయలు దేరి వెళ్లింది.