May 03,2023 23:30

వివరాలు వెల్లడిస్తున్న బాపట్ల ఎస్‌పి వకుల్‌ జిందాల్‌

ప్రజాశక్తి- అద్దంకి : ఓ వ్యక్తిని హత్యచేసి రోడ్డు ప్రమాదం చిత్రీకరించేందుకు ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్‌పి వివరాలు వెల్లడించారు. ఎస్‌పి కథనం ప్రకారం... గత నెల 10న బాపట్ల జిల్లా, బల్లికువర మండలం. కూకట్లపల్లికి చెందిన ఓరుగంటి శ్రీనివాసరావు అనే వ్యక్తి అద్దంకి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. తన తమ్ముడు ఓరుగంటి స్వామి (34)అద్దంకి నుండి మేదరమెట్ల వెళ్లే దారిలో నల్లవాగు బ్రిడ్జి దాటిన తరువాత నామ్‌ రహదారికి తూర్పు వైపున ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ వెంచర్‌కు సంబంధించిన ఖాళీ స్థలంలో తలకు బలమైన రక్త గాయమై కుడి కాలు విరిగి చనిపోయి ఉన్నాడని తెలిపాడు. దీంతో సిఐ రోశయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మతుడు జేబులోని సెల్‌ ఫోల్‌ ఫోను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం ఫోన్‌లోని కాల్‌ డేటాను పరిశీ లించారు. మృతుడు ఎక్కువసార్లు మాట్లాడిన ఓ నంబరును గుర్తించారు. ఆ నంబరు గురించి మృతుడి అన్నదమ్ములు, బంధువుల ఆరా తీశారు. వారు ఆ ఫోన్‌ నంబరు పల్నాడు జిల్లా, వినుకొండ మండలం, ఏనుగుపాలెం గ్రామానికి చెందిన దావులూరి రాంబాబుదిగా గుర్తించారు. దీంతో పోలీసులు రాంబాబును అదుపులోకి తీసుకొని విచారించగా తానే స్వామిని హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు.
మృతుడు స్వామి, రాంబాబు స్నేహితులు. ఇద్దరమూ కలిసి వినుకొండ మండల పరిధిలోని గోకనకొండలో ఓ రైస్‌మిల్లును అద్దెకు తీసుకొని వ్యాపారం చేశారు. వడ్లు కొనుగోలు నిమిత్తం రాంబాబు మృతుడు స్వామికి లక్షరూపాయలు ఇచ్చాడు. ధాన్యం రవారణా కోసం ట్రక్కు ఆటోను మృతుడి పేరుతో కొనుగోలు చేశారు. మిల్లు ప్రారంభించిన 20 రోజుల తర్వాత మతుడు అనారోగ్యంతో ఇంటికి వెళ్లిపోయాడు. వడ్ల కొనుగోలు కోసం రాంబాబు ఇచ్చిన లక్ష రూపాయలను మృతుడు సొంత అవసరాలకు వినియోగించుకున్నాడు. తర్వాత మిల్లు మూతపడింది. గత 2 నెలల నుంచి మతుడు బొడ్డువానిపాలెం రైస్‌ మిల్‌లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తాను ఇచ్చిన లక్షరూపాయలు ఇవ్వమని మృతుడిని రాంబాబు పలుమార్లు కోరాడు. మృతుడు ఏదో ఒక కారణంగా చెబుతూ డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో స్వామిని చంపాలని రాంబాబు పథకం వేసుకున్నాడు. అందులో భాగంగా గత నెల 8న రాంబాబు మతుడ స్వామికి ఫోన్‌ చేసి డబ్బులు కావాలని అడిగాడు. ఏ మిషయం మరుసటి రోజు చెబుతానని మృతుడు చెప్పాడు. మరుసటి రోజు మతుడు స్వామిచ నిందితుడు రాంబాబుకు ఫోన్‌ చేసి డబ్బులు అందలేదని తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన రాంబాబు పథకం ప్రకారం ఈనెల 9న రాత్రి సమయంలో ఆటోలో అద్దంకికి వచ్చాడు. స్వామికి ఫోన్‌ చేసి బిర్యాణి తిందామని పిలిచాడు. దీంతో స్వామి వచ్చాడు. ఇద్దరు కలిసి రెండు బిర్యానీలు తీసుకొని అద్దంకి నుంచి మేదరమెట్ల వెళ్లే దారిలో నల్లవాగు బ్రిడ్జి దాటిన తరువాత ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. బిర్యాణి తిన్న తర్వాత రాంబాబు తన డబ్బుల విషయం గురించి రాంబాబును అడిగాడు. దీంతో ఇద్దరు గొడవ పడ్డారు. అనంతరం మృతుడు బైకుపై బయలు దేరాడు. అదే సమయంలో రాంబాబు ఆటోతో వేగంగా బైకు ఢకొీట్టాడు. అనంతరం స్వామిని ఆటోతో తొక్కించాడు. అనంతరం స్వామి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వతా రాంబాబు మేదరమెట్ల మీదుగా ఇంటికి వెళ్లాడు. ఆటోను ఇంటి వద్ద పెట్టి వైజాగ్‌ వెళ్లిపోయాడు.
పోలీసు సిబ్బందికి అభినందనలు
హత్యకేసును చాక్యచక్యంగా చేధించిన అద్దంకి సిఐ రోశయ్య,ఎస్‌ఐ సమందర్‌ వలి, హెడ్‌కానిస్టేబుల్‌ జి. అంజమ్మరావు, కానిసేబ్టుల్‌ వైవి.సాగర్‌బాబను ఈ సందర్భంగా ఎస్‌పి అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.