పొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్)
తొమ్మిదేళ్ల క్రితం ప్రొద్దుటూరు వన్‌టౌన్ పరిధిలో పిడిబాకుతో గొంతు కోసి హత్య చేసిన కేసులో నేర నిర్ధారణ కావడంతో ముద్దాయి పోలు ఆనందకుమార్ (34)కు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.2 లక్షల 50 వేలు జరిమానా విధిస్తూ సోమవారం ప్రొద్దుటూరులోని రెండవ అదనపు జిల్లా కోర్టు జడ్జి జి.ఎస్.రమేష్‌కుమార్ తీర్పు ఇచ్చారు. ప్రొద్దుటూరు వన్‌టౌన్ పరిధిలోని వసంతపేటలో నివాసం ఉంటున్న మృతురాలు జలదుర్గం మీనాక్షమ్మ (65)ను పిడిబాకుతో పొడిచి రెండు చేతులు, ఎడమ చెంపపై రక్త గాయాలు చేసి.. ఒంటిపై ఉన్న బంగారు చైను, బీరువా తాళాలు తీసుకొని అందులోని వెండి వస్తువులు దొంగిలించుకుపోయాడు. మిట్టమడి వీధికి చెందిన ముద్దాయి పోలు ఆనందకుమార్ సమీపంలోని గాంధీపార్క్‌లోని లైబ్రరీలో అటెండర్‌గా పనిచేసేవాడు. ఈ నేపథ్యంలో హతురాలి ఇంటికి వెళ్లి కరెంటు పనులు చేస్తూ పరిచయం పెంచుకున్నాడు. తనకు వచ్చే జీతం సరిపోక ఏదైనా దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో హతు రాలిని చంపి బంగారు, వెండి దొంగిలించాడు. ప్రొద్దుటూరు అడిషనల్ ఎస్‌పి ప్రేరణకుమార్ పర్యవేక్షణలో వన్‌టౌన్ సీఐ కె.రాజారెడ్డి, కోర్టు మాని టరింగ్ సిబ్బంది ఎ.నాగరాజు, కె.బ్రహ్మయ్య సాక్షులను కోర్టులో హాజరు పరి చారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.రాంప్రసాద్‌రెడ్డి వాద నలు వినిపించారు. సాక్ష్యాధారాలతో ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన పో లీస్ అధికారులు, సిబ్బందిని ఎస్‌పి కెకెఎన్ అన్బురాజన్ అభినందించారు.










