Apr 17,2023 21:05

చెక్కతో తయారు చేసిన వస్తువులను పరిశీలిస్తున్న చైర్మన్‌ బి.విజయ లక్ష్మి తదితరులు

హస్త కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి
- రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ బి.విజయలక్ష్మి
ప్రజాశక్తి - ఆళ్లగడ్డ

      హస్త కళాకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్‌ పర్సన్‌ బడిగించల విజయలక్ష్మి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బడిగించల చంద్రమౌళిలు అన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం ఆళ్లగడ్డలోని ఆచారికాలనీలో చెక్కతో వివిధ రకాల బొమ్మలు, ఫర్నీచర్‌, తయారీ హస్త కళాకారులను కలుసుకొని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డిసిహెచ్‌ నుండి గుర్తింపు కార్డ్స్‌ ఇప్పించాలని, ఉడ్‌ కార్వింగ్‌ వేంకటేశ్వర స్వామి, సుబ్రమణ్య స్వామి బొమ్మల తయారీ ట్రైనింగ్‌ ప్రోగ్రాం ఇప్పించాలని కోరారు. లేపాక్షి ఎంపోరియం ల ద్వారా తాము తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన చైర్‌ పర్సన్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఏపిహెచ్డిసి కర్నూలు మేనేజర్‌ తిమ్మయ్య, సిబ్బంది కిషోర్‌, స్థానిక వైసిపి నాయకులు అహమ్మద్‌, హస్త కళాకారులు పాల్గొన్నారు.