హర్యానా దొంగల ముఠా అరెస్ట్
ప్రజాశక్తి - తిరుపతి సిటి
ఎటిఎం దొంగతనాలకు పాల్పడుతున్న హర్యానా మేవాత్ గ్యాంగ్ నేరగాళ్ల ముఠాను శుక్రవారం అరెస్టు చేశారు. నేరగాళ్లు ఆరుగురితో పాటు, రెండు లారీలు, ఓ కారు, రెండు నాటు తుపాకులు, 21 కేజీల గంజాయి, గ్యాస్‌క ట్టర్లు, రెండు లక్షల నగదును వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. గతనెల 14న ధనలక్ష్మీనగర్‌లోని ఎస్‌బిఐ ఎటిఎంలో ఈ ముఠా దొంగతనానికి పాల్పడింది. ఛాలెంజ్‌గా తీసుకున్న చంద్రగిరి డిఎస్‌పి యశ్వంత్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ సుబ్రమణ్యంరెడ్డి, రాజవేఖర్‌లు బృందాలుగా ఏర్పడి ఢిల్లీ, హర్యానా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో జల్లెడ పట్టారు. మేవాత్ గ్యాంగ్‌పై పై నాలుగు రాష్ట్రాల్లో 19 కేసులు ఉన్నాయి. ముఠాలో ప్రధాన ముద్దాయి సద్దాంఖాన్‌పై వివిధ రాష్ట్రాల్లో 23 కేసులు నమోదయ్యాయి. ఎపి, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో గంజాయి తక్కువ రేటుకు కొనుగోలు చేసి హర్యానా రాష్ట్రంలో ఎక్కువ రేటుకు విక్రయించేవారు. ముఠాలోని ఇద్దరు సభ్యులు రహాడి సద్దాం, అమీర్‌ఖాన్‌లు పరారీలోఉన్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ పోలీసులకు ఎస్‌పి పి.పరమేశ్వర్‌రెడ్డి రివార్డులు అందజేశారు.










