Sep 26,2022 23:34

వీడ్కోలు సమావేశంలో మాట్లాడుతున్న హరిహరనాథ శర్మ

ప్రజాశక్తి-లీగల్‌ విలేకరి : జ్యుడీషియల్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతిపై బదిలీ అయి వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాధ శర్మకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన వీడ్కోలు పలికారు. జిల్లా కోర్టు న్యాయ సేవాసదన్‌లో సోమవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిహరనాధ శర్మ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సారథులైన ప్యానల్‌ లాయర్లు, పారా లీగల్‌ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు తన ఆధ్వర్యాన సేవలందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదే ఒరవడిని కొనసాగించి జిల్లాలో న్యాయ సేవను విస్తరించి కక్షిదారులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కం ఇన్‌ఛార్జి ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి, పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వల్లభ నాయుడు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి కెకెవి.బులికృష్ణ, ప్యానల్‌ లాయర్లు కుప్పిలి మురళీధర్‌, బగాది తులసీదాస్‌, ఆర్‌ శ్రీనివాసరావు, లక్ష్మీ రాంబాబు, పారా లీగల్‌ వాలంటీర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొని జిల్లా ప్రధాన న్యాయమూర్తిని సన్మానించారు.