మదనపల్లె అర్బన్ : ఏపీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని జిఆర్‌టి ఉన్నత పాఠశాలలో ఆజాది కా అమత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా సంబరాలు ఘనంగా నిర్వహంచారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.మునిగోల కష్ణ, కార్యదర్శి వి.ఎం.నాగరాజు, ట్రెజరర్ ఉస్మాన్ సాహెబ్, గౌరవాధ్యక్షులు మునిరత్నమయ్య, ఉపాధ్యక్షులు జగన్మోహన్, శకుంతలమ్మ, ఆర్గనైజర్ కరుణాకర్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్.మునిగోపాల కష్ణ మాట్లాడుతూ ఘర్ తిరంగా సంబరాలను పురస్కరించుకొని ఈనెల 13,14,15 తేదీల్లో ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేసి స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు నిర్వహించుకోవాలని చెప్పారు. త్రివర్ణ పతాకం ఎగురవేయడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కార్యదర్శి వి.ఎం.నాగరాజు నివేదికను చదివి వినిపించారు .ట్రెజరర్ ఉస్మాన్ సాహెబ్ జమ, ఖర్చులు చదివి సభ్యుల ఆమోదం పొందారు. అనంతరం మునిరత్నమయ్య, జగన్మోహన్, ప్రొఫెసర్ శ్రీనివాసులు, డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు, సరస్వతమ్మ స్వాతంత్ర దినోత్సవంపై ప్రసంగించారు. ఇందులో భాగంగా ప్రముఖ నవలా రచయిత టిఎస్‌ఎ కష్ణమూర్తి రచించిన భయం లేని బ్రతుకు నవల ఎంతో అద్భుతంగా ఉందని కితాబునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ కష్ణ కుమార్, రామచంద్రయ్య, ఆర్గనైజర్ కరుణాకర్, ధనలక్ష్మి, సరస్వతమ్మ, మనోహరమ్మ, ఉపాధ్యక్షులు రమణ కష్ణమూర్తి పాల్గొన్నారు.
నేల తల్లికి నమస్కారం
ఆజాదికా అమత మహోత్సవంలో భాగంగా మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల విద్యార్థులు మువ్వన్నెల జెండాల చేతపట్టుకుని పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ ఆర్ గురు ప్రసాద్, ప్రిన్సిపల్ ఆర్ రమాదేవి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన స్వాతంత్ర సమరయోధులతోపాటు, దేశ రక్షణకు సరిహద్దుల్లో నిరంతరం శ్రమిస్తున్న సైనికులను గుర్తుంచుకోవాలన్నారు. పచ్చదనం పెంచి మన దేశాన్ని హరిత భారతదేశంగా మార్చుకుందామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సిటిఎం రోడ్, పటేల్ రోడ్డు మీదుగా ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు మునీంద్ర నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.










