
యడ్లపాడు: మండలం లోని దింతెనపాడు గ్రామము ను హర్ ఘర్ జల్ గ్రామం( ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇచ్చిన గ్రామం) గా ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ సమన్వయ కర్త తేజ్ సంగీత్ శుక్రవారం గ్రామానికి వచ్చారు. పంచాయతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో సర్పంచ్ దేవరపు సుమతి కి హర్ ఘర్ జల్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. గ్రామంలోని ప్రతి వ్యక్తికీ తాగునీటిని అందించాలని సూచించారు. ప్రతి పదిహేను రోజులకొకసారి నీటిని క్లోరినేషన్ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏ.ఈ శ్రీని వాసరావు, ఎం ఆర్వో కుటుంబరావు, పిఓపిఆర్డి వరూ ధిని, పిఎస్ శశికళ, లావణ్య, ఐఎస్‌ఎ (పోర్డ్) ప్రతినిధులు గేరా రాజ్ కుమార్, నళిని పాల్గొన్నారు.