Sep 22,2023 23:38

హోటళ్లు, బేకరీల తనిఖీ

హోటళ్లు, బేకరీల తనిఖీ
ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌ : పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద గల పబ్జి హోటల్‌ను పురపాలక సంఘ కమిషనర్‌ కేఎల్‌ఎం రెడ్డి తనిఖీ చేయగా అందులో రాత్రి నిల్వవుంచిన ఆహార పదార్థాలను గుర్తించి, వాటిని పునర్వినియోగించరాదని హెచ్చరిస్తూ ఇలాంటి పొరపాట్లు మళ్లీ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేవతి బేకరిని తనిఖీ చేసి శుభ్రతను తప్పక పాటించాలని హెచ్చరించారు. పట్టణంలోని మదర్‌ థెరిస్సా బదిర , బుద్దిమాంద్య పాఠశాలను సందర్శించి పిల్లలకు మనోధైర్యంను తెలిపి పలు బహుమతులను అందజేశారు. అనంతరం అండర్‌ బ్రిడ్జిలోని గ్రిల్‌లో పూడిక తీసివేత కార్యక్రమం చేపట్టారు. పుత్తూరు పట్టణం అభివద్ధి పథంలో నడిపించుటలో అందరూ పాలుపంచు కోవాలనికోరారు.