తలపడుతున్న ఖోఖో జట్లు
హోరహోరిగా తలపడుతున్న ఖోఖో జట్లు
ప్రజాశక్తి పగిడ్యాల
ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి సబ్ జూనియర్ ఖోఖో క్రీడా పోటీల ఎంపికలో క్రీడాకారులు హోరాహోరిగా తలపడ్డారు. ఆదివారం పగిడ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఖోఖో క్రీడా పోటీల ఎంపిక నిర్వహించార. ఈ పోటీలలో పాల్గొనేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి దాదాపు 48 పాఠశాలల క్రీడాకారులు పాల్గొన్నట్లు వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభ బాల బాలికలు ఎంపిక చేసి చిత్తూరు జిల్లా యాదమర్రి లో రాష్ట్రస్థాయిలో ఈనెల 20 నుంచి 22 వరకు ఖోఖో పోటీలలో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయులు తెలిపారు. క్రీడాకారులు వారి ప్రతిభను కనపరిచేందుకు హోరాహోరీగా పోటీపడుతున్నారు.










