Apr 10,2023 16:27

బండలాగుడు పోటీలు ప్రారంభిస్తున్న ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గంధం రాఘవరెడ్డి.


హోరాహోరీగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
ప్రజాశక్తి - రుద్రవరం

      మండలంలోని చిన్నకంబలూరు గ్రామంలో సోమవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు హోరాహోరీగా జరిగాయి. గుడ్ ఫ్రైడే ,ఈస్టర్ పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన సీనియర్ ఎద్దుల రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ఆళ్లగడ్డ మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ గంధం రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలలో నంద్యాల ,కడప కర్నూల్, జిల్లాలకు చెందిన 6జతల ఎద్దులు పాల్గొన్నాయి. పోటీల లో గొలుపొందిన ఎద్దులకు నగదు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చెన్నప్ప, నాయకులుజంగా పెద్ద పుల్లారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మదర్ సాహెబ్ ,లక్ష్మి కాంత్ రెడ్డి, రవి ,రామస్వామి, పలువురు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.