Nov 10,2023 23:01

ప్రజాశక్తి-గండేపల్లి ఆదిత్య విద్యా ప్రాంగణంలో గురువారం నుంచి జరుగుతున్న సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ కబడ్డీ (పురుషులు) టోర్నమెంట్‌ 2023 పోటీలు హోరాహోరీగా ఆద్యంతం రసవత్తరంగా సాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో రెండో రోజు వివిధ టీముల మధ్య జరిగిన పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. నిన్న రాత్రి 11-00 గంటల వరకు జరిగిన పోటీలు ఈ రోజు ఉదయం 7-00 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. దక్షిణాది (ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి) ఆరు రాష్ట్రాలకు చెందిన 113 యూనివర్సిటీలకు చెందిన 95 టీములు సుమారు 1200 మంది ఆటగాళ్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రావీణ్యాన్ని చూపుతున్నారు. అనుభవజ్ఞులైన న్యాయనిర్ణేతలు పర్యవేక్షణలో పూర్తి పారదర్శకంగా స్నేహపూర్వక వాతావరణంలో విధ్యార్థుల కేరింతలతో పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. నాకౌట్‌ తరహాలో నిన్న జరిగిన 33 మ్యాచ్‌లలో గెలుపొందిన వారు తర్వాతి రౌండ్‌ కు అర్హత సాధించారు. ఈ రోజు మరో 33 టీములు పోటీలు జరిగిన పోటీల్లో గెలుపొందిన విజేతలు తర్వాత రౌండ్‌లకు అర్హత సాధించారు.