
ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్ : హోంగార్డులు క్రమ శిక్షణతో విధులు నిర్వర్తించి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని హోంగార్డ్స్ కమాండెంట్ ఎమ్. మహేష్ కుమార్ పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా యూనిట్ లో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డులతో పెరేడ్, దర్బార్‌ను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమాండెంట్ మాట్లాడుతూ ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలన్నారు. హోంగార్డుల దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నవేనని అన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యాంగా ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడానికి వీలవుతుందన్నారు. విధుల్లో నైపుణ్యాన్ని బాగా మెరుగుపరుచుకోవడానికి పలు మెళకువలు సూచించారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఇన్సూరెన్స్ లు రెన్యువల్ అవుతున్నాయా లేదా చూసుకొంటూ ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా హోంగార్డులకు ప్రశంసాపత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్‌పి జెడ్ విజరు కుమార్, రాజశేఖర్ రెడ్డి, ప్రదీప్ సింగ్, ఎఎస్‌ఐ శ్రీరాములు, సబ్ డివిజన్ల హోంగార్డుల ఇన్‌ఛార్జి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.