May 17,2023 23:56

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ ఏలూరు రేంజ్‌ డిఐజీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జివిజి.అశోక్‌ కుమార్‌ రాష్ట్ర హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనితను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్చం అందించారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోలీసుల బదిలీల్లో అశోక్‌ కుమార్‌ విజయవాడ నుంచి బదిలీపై ఏలూరు రేంజ్‌ డిఐజిగా వచ్చారు.