ప్రజాశక్తి-విజయవాడ
రంగుల ఉత్సవం హోలీ పండుగ ప్రజల జీవితాలలో అనందమయ రంగుల హరివిల్లులను నింపాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తెలిపారు.హోళి పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, ఆయన సతీమణి ప్రశాంతి, తల్లి పార్వతి, కుమారుడు జివితేష్, కుమారై సిరిచందన, ఇతర బంధువులు సిబ్బందితో కలిసి నగరంలోని ఆయన నివాసంలో ఆనందోత్సవాల నడుమ హోళి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మట్లాడుతూ శ్రీ కృష్ణ భగవానుడికి ప్రీతి పాత్రమైన హోళి పండుగను మధుర, బృందావనం, నందగావ్ బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారన్నారు. వసంత కాలంలో వాతావరణంలో కలిగే మార్పులు వలన విష జ్వరాలు సంభవిస్తాయని సహజసిద్దమైన రంగు పొడులను జల్లుకోవడం వలన ఔషదంగా పనిచేస్తాయని పెద్దల నమ్మకం అన్నారు. గతంలో వ్యాధినిరోధక శక్తికి ఉపయోగపడుతుందని నమ్మకంతో సహజసిద్దమైన రంగులలో నిమ్మ, పసుపు, కుంకుమ, బిల్వ పత్ర పొడులను మోదుగ పుష్పలను ముందురోజు నీటిలో నానబెట్టి వాటిని హోళి ఉత్సవంలో జల్లుకునేవారని అటువంటి సాంప్రదాయాన్ని నేటి తరం పాటించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.










