పోస్టుకార్డులతో వినతి పంపుతున్న నాయకులు
ప్రజాశక్తి - హోళగుంద
ఢణాపురం నుంచి హోళగుంద వరకు రోడ్డు వేయాలని నాయకులు కోరారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హోళగుంద జెఎసి కమిటీ సభ్యులు 5 వేల పోస్టు కార్డులతో వినతి పంపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, విద్యార్థులు, మహిళలు రోడ్డు కోసం పడుతున్న కష్టాన్ని కార్డులో వివరించి, త్వరగా ఢణాపురం నుంచి హోళగుంద వరకు వేయాలని జగన్మోహన్ రెడ్డిని కోరారు.










