హనుమంత వాహనంపై కోదండరాముడు
రాత్రి గజ వాహనంపై శ్రీవారు
ప్రజాశక్తి -తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నవరాత్రి బ్మ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా నిర్వహించారు. విశేషంగా విచ్చేసిన భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతి, జెఈవోల సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.










