Sep 09,2023 23:48

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
మాజీ సర్పంచ్‌ దేవభక్తుని చంద్రమౌళి శనివారం మృతి చెందారు. విద్యా దానం చేయటంలో చంద్రమౌళి ముందుండేవారు. స్థానికంగా హైస్కూలు ఏర్పాటు, బాలికోన్నత పాఠశాల ఏర్పాటు చేయటంలో ఆయన కృషి చేశారు. ఆయన మృతి చెందటంతో  కుటుంబ సభ్యులు రోటరీ అవయవదాన కమిటీ సభ్యులకు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో గుంటూరు శంకర్ కంటి ఆసుప్రతి వైద్యులు హనుమోజిపాలెం వచ్చి కార్నియాలను సేకరించినారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు నల్లమోతు రాణి, నల్లమోతు ఉమా, కొల్లూరి మాధవి, నల్లమోతు మధుసూదనరావు, కొల్లూరి పానకాలు చౌదరి, దేవభక్తిని చందు, విజయ భాస్కరరావు, జీవనజ్యోతి, సుష్మలను నేత్రదానం అవయవ కమిటీ సభ్యులు సోమేపల్లి రామ్మోహనరావు,  జెట్టి స్వామి, క్లబ్‌అధ్యక్ష, కార్యదర్శులు కరి కమలేశ్వరరావు, జెట్టి వెంకటేశ్వర్లు అభినందించారు.