
ప్రజాశక్తి-ఆత్రేయపురం
వాడపల్లి వెంకటేశ్వర స్వామి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు మూడవరోజు శనివారం ఘనంగా జరిగాయి. హనుమద్వాహనంపై కోదండరామ అలంకరణలో కోనేటిరాయుడు యాత్రికులకు దర్శనమిచ్చాడు. స్వామివారికి వేకువ జాము నుంచే పూజా కార్యక్రమాలు పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు మహా పుష్పయాగాన్ని నిర్వహించారు. రావులపాలెంనకు చెందిన మేడపాటి సత్యనారాయణ రెడ్డి దంపతులు అలాగే ఆలయ ఛైర్మన్ రమేష్ రాజు దంపతులు, ఇఒ సత్యనారాయణ దంపతులు బ్రహ్మోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని స్వామివారిక పూజ నిర్వహించారు. రాత్రి స్వామి వారు కోదండ రామ అలంకరణలో హనుమద్వాహనంపై విహరించారు.