ప్రజాశక్తి - ఆదోని
హమాలీ కార్మికులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు పట్టణ కార్యదర్శి పిఎస్.గోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం ఆదోనిలోని సుందరయ్య భవనంలో డిగారి గేటర్ హమాలీ వర్కర్స్ యూనియన్ సమావేశం బి.రాజు అధ్యక్షతన జరిగింది. సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బి.తిప్పన్న, పిఎస్.గోపాల్, ఉపాధ్యక్షులు డి.లక్ష్మన్న హాజరై మాట్లాడారు. అసంఘటిత రంగమైన హమాలీ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ అందడం లేదన్నారు. ప్రభుత్వం హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు, పింఛను సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డిగారి గేటర్ హమాలీల కూలి రేట్ల అగ్రిమెంట్ ఆగస్టు 31కి ముగియడంతో డిమాండ్ నోటీస్ ఇవ్వాలని తీర్మానం చేశారు. అనంతరం డిగారి గేటర్ హమాలీ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షులుగా పిఎస్.గోపాల్, అధ్యక్షులు బి.రాజు, కార్యదర్శి ఈరప్ప, కోశాధికారి బి.రంగ, ఉపాధ్యక్షులు ఈరన్న, వీరాంజిని, సురేష్, బసప్ప, సహాయ కార్యదర్శులుగా హుస్సేనప్ప, వీరారెడ్డి, వీరప్ప, అయ్యన్న, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న గోపాల్










