ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ సివిల్ సప్లరు స్టాక్ పాయింట్‌లో పని చేస్తున్న హమాలీల జీతాలు, బోనస్ తక్షణమే చెల్లించాలని హమాలీ యూనియన్ జిల్లా గౌరవాధ్య క్షులు ఆర్‌వి.నాయుడు డిమాండ్ చేశారు. శనివారం సిఐటియు ఆధ్వర్యంలో సివిల్ సప్లరు హమాలీలు సివిల్ సప్లరు డిఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇప్పటికే 26 జిల్లాల్లో హమాలీలకు జీతాలు, బోనస్ చెల్లించారని తెలిపారు. జిల్లాలోని 12 స్టాక్ పాయింట్లలో మాత్రమే జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. ప్రధానంగా దసరా పండుగ 23న ఉంది కావున జీతాలు వెంటనే ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. విషయం తెలుసుకున్న సివిల్ సప్లరు శాఖ డిఎం నీలమయ్య ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చించారు. సాయంత్రంలోగా హమాలీల వేతనాలు వారి ఖాతాల్లో జమ అవుతాయని హామీ ఇచ్చారు. బోనస్ నాలుగైదు రోజుల లోపల చెల్లిస్తామని చెప్పారు. అనేక మందికి పిఎఫ్‌లో పేర్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి తొందరలోనే పిఎఫ్ నంబర్ వచ్చేటట్లు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లరు హమాటీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, కోశాధికారి సుబాన్, మేస్త్రిలు నారాయణస్వామి, శంకర్, అనంతపురం అర్బన్ రూరల్ స్టాక్ పాయింట్ హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.
సివిల్ సప్లరు డిఎం కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న హమాలీలు










