Oct 17,2023 23:29

శింగరాయకొండలో ధర్నా నిర్వహిస్తునర్న హమాలీలు

ప్రజాశక్తి-చీమకుర్తి : సివిల్‌ సప్లరు హమాలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నాయకుడు పూసపాటి వెంకటరావు డిమాండ్‌ చేశారు. హమాలీల సమస్యలు పరిష్కరిఆంచాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ హమాలీ కార్మికులకు బోనస్‌ రూ.7,000 ఇవ్వాల న్నారు. పిఎఫ్‌,ఇఎస్‌ఐ సమస్యలు పరిష్కరించా లన్నారు. రిటైర్డుమెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్ర మంలో హమాలీల సంఘం నాయకులు హనుమాన్‌, నాగరాజు, వెంకటేశ్వర్లు, వీరయ్య, సుబ్బయ్య పాల్గొన్నారు. శింగరాయకొండ : సివిల్‌ సప్లరు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ిసిఐటియు జిల్లా నాయ కులు జి.శ్రీనివాసులు టంగుటూరు రాము డిమాండ్‌ చేశారు. సివిల్‌ సప్లరు కార్మికుల సమస్యలు పరిష్కర్కించాలని కోరుత స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు ప్రతి నెలా మొదటి వారంలో బిల్లులు ఇవ్వాలన్నారు. సిపిఎఫ్‌ నెంబర్లు ఇవ్వని వారికి వెంటనే ఇవ్వాలన్నారు. రిటైర్‌ అయినవారికి, చనిపోయిన వారికి పిఎఫ్‌, పెన్షను సెటిల్మెంట్‌ చేయాలన్నారు. ఇఎస్‌ఐని అమలు చేయించాలని, బోనస్‌ను రూ.7వేలకు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దారు కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సిహెచ్‌.మురళీ, ఆర్‌.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.