ఎన్నికైన నూతన కార్యవర్గం
ప్రజాశక్తి - హాలహర్వి
హమాలీ సంఘం నూతన కమిటీ ఎన్నికైంది. గురువారం గోవిందమ్మ గుడిలో సంఘం మండల నూతన మహాసభ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి కృష్ణ అధ్యక్షత వహించారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షులు సతారీ ఈరన్న, ఉపాధ్యక్షులు ఎం.గాదిలింగప్ప, కార్యదర్శి బసవరాజు, సహాయ కార్యదర్శి రామాంజినప్ప, కోశాధికారి సి.రామాంజనప్ప, సహాయ కోశాధికారి రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వెంకటరమణ, ఆదామ్, రాముడు, సుబ్బయ్య, భీమలింగ, సతారీ దర్గప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సిఐటియు జిల్లా నాయకులు కెపి.నారాయణస్వామి మాట్లాడారు. ప్రభుత్వం హమాలీలకు పింఛను, ఈఎస్‌ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలిపారు.










