Feb 26,2023 00:06

నినాదాలు చేస్తున్న టిడిపి నేతలు

ప్రజాశక్తి-జి.మాడుగుల: గిరిజన ప్రాంతంలో హక్కుల్ని, చట్టాల్ని కాలరాస్తే ఊరుకునేది లేదని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. శనివారం వంతల, సొలభం పంచాయతీలలో మండల అధ్యక్షులు వంతల కొండలరావు ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రోడ్లు, డ్రైనేజీలు తదితరివి వేసి అభివృద్ధి చేశారన్నారు. గిరిజనుల పక్షాన పోరాటం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్‌ కార్యదర్శి సోమల చిట్టిబాబు, సంస్కతి విభాగం నియోజకవర్గ అధ్యక్షులు సమిరెడ్డి నాగబ్బాయి, క్లస్టర్‌ ఇన్చార్జిలు సోమేలి రమణ బాబు, వంజరి చిరంజీవి నాయుడు, పంచాయతీ అధ్యక్షులు వంతల కృష్ణమూర్తి నాయుడు, మాజీ ఎంపిటిసి వంతల కళ్యాణి, వైస్‌ ఎంపీపీ గేమ్మేలి కొండబాబు, పాల్గొన్నారు.