ప్రజాశక్తి-సీతమ్మధార : వినియోగదారులంతా వారి హక్కులపై అవగాహన కలిగి ఉండాలని మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు. ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ చైర్మన్ డాక్టర్ సాయిరమేష్ రాజ్మల్ ఆధ్వర్యాన శనివారం ఏర్పాటుచేసిన నేషనల్ కన్జూమర్ డే కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మోసపూరితమైన ప్రకటనలు నమ్మరాదని, నాణ్యమైన ఉత్పత్తుల ఎంపిక, వాటి ధర ఆధారంగా వస్తువులను కొనుగోలు చేయాలని తెలిపారు. వస్తువుల నాణ్యత సరైనది కానప్పుడు వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కన్జూమర్ చట్టాన్ని రూపొందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అంబుడ్స్ మ్యాన్ వైసిహెచ్ దొర, కన్జూమర్ రైట్ ప్రతినిధులు తనుంజన్‌రెడ్డి, జి.వెంకటేశ్వరి, పొట్నూరు రాజు తదితరులు పాల్గొన్నారు.










