Oct 14,2023 20:21

సమావేశంలో మాట్లాడుతున్న డివైఎఫ్‌ఐ నాయకులు

 కడప అర్బన్‌ : జిల్లాలో ప్రయివేట్‌, కార్పొరేటు పాఠశాలలో పని చేస్తున్న ఉపాద్యాయుల హక్కులను యాజమాన్యాలు హరిస్తాయని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్‌ తెలిపారు. దసరా సెలవుల్లో ప్రయివేట్‌ ఉపాధ్యాయులకు క్లాసు వర్క్‌, వర్క్‌ షాప్‌ పేరుతో నిర్వహిస్తున్న వారిని డివైఎఫ్‌ఐ అధ్వర్యంలో అడ్డుకుని ఉపాధ్యాయులకు కూడా సెలవులు ఇవ్వాలని వారిని పంపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే దసరా సెలవులు 14 నుంచి 24 వ తేదీ వరకు ప్రకటిం చిందని చెప్పారు. సెలవులలో స్కూల్స్‌ ఎటువంటి పరిస్థితులలో తరగతులు నిర్వహించ వద్దు అని, అలా నిర్వహించిన వాటి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందన్నారు. ఇచ్చే జీతం తక్కువ, పని ఒత్తిడి ఎక్కువన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేట్‌, కార్పొరేటు స్కూల్స్‌ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సునీల్‌,రాజేంద్ర ప్రసాద్‌, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు, జిల్లా సహాయ కార్యదర్శి తులసిశ్వర్‌ యాదవ్‌, నాయకులు సూరి పాల్గొన్నారు.