ప్రజాశక్తి-తాడిపత్రి దళితులకు సామాజిక న్యాయం, హక్కుల సాధనకు కెవిపిఎస్ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప పిలు పునిచ్చారు. కెవిపిఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా శనివారం తాడిపత్రి కార్యాలయం వద్ద కెవిపిఎస్ జెండాను ఆవిష్కరించాలరు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయం గా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై కెవిపిఎస్ అధ్యయన ం చేసి ఆయా సమస్యల పరిష్కారానికి ఎస్సీ కమిషన్ ఏర్పా టు చేయాలని ఉద్యమించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 18 జీఓలు దళితుల అభ్యున్నతి కోసం ఇచ్చారన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దళితుల శ్మశాన స్థలాల సమస్యపై ఉద్యమం చేపట్టిన ఫలితంగా ప్రతి దళిత గ్రామానికీ రెండెకరాల శ్మశాన స్థలంతోపాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని 1235 జిఓను సాధించిందన్నారు. వీటితోపాటు అనేక సమస్యల పరిష్కారానికి మార్గాలు చూపిన ఘనత కెవిపిఎస్‌కు దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో స్టేషన్ బెయిలు ఇచ్చే నోటీసును రద్దు చేయాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిటీల సిఫార్సులు అమలు చేసి ప్రతి దళిత కుటుంబానికీ రెండెకరాల భూమి, రెండుసెంట్ల స్థలం, ప్రతి దళితవాడకీ శ్మశానం స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఐద్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వాములై దళితులకు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.నాగరాజు, సిఐటియు జిల్లా నాయకులు జగన్, ఉమాగౌడ్, అంజి, చంద్రకళ, డప్పు కళాకారులు తిరుపాల్, శ్రీరాములు, శివ తదితరులు పాల్గొన్నారు.
జెండాను ఎగురవేస్తున్న కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, నాయకులు










