ప్రజాశక్తి - హోళగుంద
హక్కుల సాధన కోసం బీసీలు ఐకమత్యం కావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుడిసె శివన్న కోరారు. శనివారం స్థానిక తుంగభద్ర డ్యాం బోర్డు అతిథిగృహం మైదానంలో బీసీ సంక్షేమ సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరయి మాట్లాడారు. బీసీ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. బీసీల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. అంతకుముందు బీసీ సంక్షేమ సంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా ఎం.మల్లికార్జున, అధ్యక్షులుగా డి.నాగప్ప, ఉపాధ్యక్షులుగా జి.వెంకటేశ్వర్లు, చంద్ర, ప్రధాన కార్యదర్శిగా కోగిలతోట వెంకటేశ్వర్లు, కార్యదర్శులుగా శివన్న, గజ్జహళ్లి వెంకోబా, సహాయ కార్యదర్శులుగా రాఘవేంద్ర, రమేష్, సభ్యులుగా మల్లికార్జున, బీరప్ప, ఎరిస్వామి, తిక్కన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎన్నికైన నూతన కమిటీ










