May 19,2023 01:09

నడింపల్లి జానకిశైలజను అభినందిస్తున్న చంద్రమౌళీశ్వరి

 గుంటూరు లీగల్‌: జిల్లాలో వద్ధులు, అనాధ బాలలు ఎదుర్కొంటున్న సామా జిక, న్యాయ సమస్యల పరిష్కారా నికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి చంద్రమౌళీశ్వరి పేర్కొన్నారు. గురువారం స్థానిక శ్రీనగర్‌ ఏడవ లైను మాతశ్రీ వద్ధుల ఆశ్రమం, రవీంద్రనగర్‌ మాతశ్రీ చైల్డ్‌ కేర్‌ హౌమ్‌ నిర్వాహకురాలు నడింపల్లి జానకి శైలజ 67వ జన్మదినం వేడుకల సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి చంద్రమౌళీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీనగర్‌ ఆశ్రమంలో కేక్‌ కత్తిరించి వద్ధులకు, బాలలకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయమూర్తి చంద్రమౌళీశ్వరి మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వద్ధులకు అందవలసిన వద్ధాప్య పింఛన్లు, ఆధార్‌ కార్డులు, వైద్య పరమైన సేవలు సక్రమంగా అందేవిధంగా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారని తెలియజేశారు. వద్ధులను కుటుంబ సభ్యులు అకారణంగా వేధించటం వారి ఆస్తులను అక్రమంగా కాజేసి వారిని మానసికంగా వేధించే వ్యక్తు లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత 24 సంవత్స రాలుగా వద్ధుల, బాలల ఆశ్రమాలను నిర్వహిస్తున్న నడింపల్లి శైలజ, విజయ ప్రసాద్‌ దంపతులను అబి óనందించారు. కార్య క్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ సభ్యులు మహేష్‌, జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్‌ బత్తుల దేవానంద్‌, రాష్ట్ర ఎస్టీ ఉద్యో గుల సం ఘం ఉపాధ్యక్షులు ఉయ్యాల టైగర్‌ ప్రసాద్‌, ప్రజా ఆలో చన వేదిక అధ్య క్షులు మేడూరి రాజేంద్ర ప్రసాద్‌, మాలకొం డయ్య పాల్గొన్నారు.