హజరత్తయ్యకు సన్మానం
ప్రజాశక్తి-ఎఎస్‌పేట : రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన ఎం.హజరత్తయ్యను తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లు బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో తహశీల్దార్ రమణారావు, డిప్యూటీ తహశీల్దార్ సతీష్, తోటి విఆర్‌ఒలు, కార్యాలయ సిబ్బంది, రాష్ట్ర రెవెన్యూ అధికారుల రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన హజరత్తయ్యను శాలువాలు పూలమాలలేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్‌ఒ, సహా ఉద్యోగి, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం కోసం ఇప్పటివరకు నిరంతరం కృషి చేస్తున్న మద్దు హజరత్తయ్యను రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు హజరత్తయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. వారు ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం హజరత్తయ్య మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘంలో ఉన్న నన్ను తనపై నమ్మకంతో రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకొని తనతోటి రాష్ట్ర జిల్లా రెవెన్యూ ఉద్యోగులు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు. గ్రామ రెవెన్యూ అధికారుల ప్రతి సమస్యను పైఅధికారుల సహకారంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ రమణారావు, డిప్యూటీ తహశీల్దార్ సతీష్, సీనియర్ అసిస్టెంట్ పెంచలయ్య, జూనియర్ అసిస్టెంట్ రవితేజ, ఎఎస్‌ఒ రాజేంద్రప్రసాద్, విఆర్‌ఒలు మీరావలీ, అమాసయ్య, నరేష్, గణేష్, అరుణమ్మ, చిన్నమ్మ, కంప్యూటర్ ఆపరేటర్ విశ్వనాథ్, విఆర్‌ఎలు నాగార్జున, సునీల్, రామకృష్ణ, అటెండర్ శ్రీదేవి, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.










