ప్రజాశక్తి -నర్సీపట్నం టౌన్ :హింసలేని సమాజాన్ని నిర్మించాలని రాష్ట్ర జనవిజ్ఞాన వేదిక నాయకురాలు రాధా రాణి పిలుపునిచ్చారు. స్థానిక ఉమెన్స్ మెయిన్స్ కాలేజీలో ఐద్వా ఆధ్వర్యంలో డిసెంబర్ 12 వరకు హింసా దినంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆడపిల్లలపై మానసికంగానూ, భౌతికగాను ఎన్నో దాడులు జరుగుతున్నాయని, వీటిని ఎదుర్కొనే సత్తా చిన్ననాటి నుండే తెలుసుకోవాలన్నారు. ప్రతి సమస్యను దాని మూలాలను శాస్త్రీయుతతో ఆలోచన చేయాలన్నారు. సమస్య నుండి భయపడి పారిపోకుండా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఐద్వా నాయకురాలు గౌరీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చట్టాలు నిర్వీర్యం చేసి హింసను ప్రేరేపించే విధంగా చేస్తోందని విమర్శించారు. నర్సీపట్నంలో హింసాత్మక చర్యలు వెలుగుచూస్తున్నాయని, మత్తు పదార్థాలకు, గంజాయికి అలవాటు పడ్డ యువత చెడుతోవలో ప్రయాణిస్తున్నారన్నారు.










