Aug 09,2023 00:35

మాట్లాడుతున్న చంద్రమౌళీశ్వరి

ప్రజాశక్తి-గుంటూరు లీగల్‌ : కళాశాల విద్య అభ్యసించే ప్రతి ఒక్కరూ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సివిల్‌ జడ్జి చంద్రమౌళీశ్వరి అన్నారు. స్థానిక అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్‌ కాలేజీలో జిల్లాన్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు మంగళవారం నిర్వహించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని ఆమె చెప్పారు. విద్యార్థుల్లో ర్యాగింగ్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పి.వి.రాంబాబు, ప్యానల్‌ అడ్వకేట్‌ కట్టా కాళిదాసు, కాలేజి ప్రిన్సిపాల్‌ సుబ్బారావు, వైస్‌ ప్రిన్సిపాల వి.నర్సిరెడ్డి, సెక్రెటరీ సిహెచ్‌.రామకృష్ణమూర్తి పాల్గొన్నారు.