Feb 20,2022 13:01

నేనేమీ అఘోరాల్లా
విడిచేసి
లక్షలాది మధ్య తిరగట్లే

నన్ను చూడు
నా అందం చూడు
అంటూ
నగంగా నదీ తీరాల
వెంబడి
నడవట్లే

నేను పుట్టినప్పటి నుండి
పెరిగిన సంప్రదాయాన్ని
శిరసావహిస్తూ
నా జుట్టును కప్పుకుంటూ
మెడ చుట్టూ ఓ వస్త్రం
అంతే
మీకొచ్చిన నొప్పి ఏంటో

మీ పంచె లాల్చీ భుజాన
కండువా
మీరొదిలేసినట్లు
నేనూ వదిలేయా
నా దుస్తులను

నేనేమీ ధరించాలో
మీరెవర్రా
నిర్ణయించటానికి
నా మేను
నా వస్త్రం
నా వేషధారణ నా ఇష్టం

నల్ల గుడ్డల్లోళ్లు
నా గురించి వకాల్తా
రాజ్యంలో
సమస్యలేమీలేనట్లు

ఎవడెన్ని కూసినా
కోతలు కోసినా
రాజ్యాంగమే నా ఆయుధం
ఇదేమీ మను రాజ్యం కాదు
గొంతు మూగబోవటానికి
హిజాబ్‌ యే
నా చేతి కొడవలి ఇప్పుడు
కంకులన్నీ రాలిపడాలంతే

గిరి ప్రసాద్‌ చెలమల్లు
94933 88201