Jul 28,2023 23:32

అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

ప్రజాశక్తి-యస్‌.రాయవరం:ప్రపంచ హెపటైటిస్‌ దినోత్స వాన్ని'' పురష్కరించుకొని మండలంలో సర్వసిద్ధి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి ఎస్‌ రాయవరం గ్రామంలో శుక్రవారంఅవగాహన ర్యాలీ చేపట్టామని మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎస్‌ ఎస్‌వి శక్తి ప్రియ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హెపటైటిస్‌ లక్షణాలు మొదట్లో అలసట, వికారం, వాంతులు, ఆకలి లేకపోవడం, శరీరం నొప్పులు వంటివి ఉంటాయన్నారు. కొన్ని వారాల తరువాత కామెర్లు, ముదురు రంగు మూత్రం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌ఎన్‌ఎం రత్నసఖి, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు వై.అనుష, జి.కొండబాబు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ క్లినిక్‌ క్లస్టర్‌ పర్యవేక్షకులు, మలేరియా ఇంఛార్జి నోడల్‌ అధికారి పి.ఎన్‌.వి.ఎస్‌.ప్రసాద్‌ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
పెందుర్తి : ప్రపంచ హెపటైటిస్‌డే సందర్భంగా స్థానిక ఆదర్శ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు హెపటైటిస్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలేజీ సెక్రటరీ టి.తియోపిలస్‌ మాట్లాడుతూ, వైరస్‌ ద్వారా సంక్రమించే హెపటైటిస్‌ పట్ల అవగాహన కలిగి, అప్రమత్తంగాఉండాలని సూచించారు. ఈ సందర్భంగా హెపటైటిస్‌పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ఎన్‌ఇ ఫ్లోరా, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి అచ్చమ్మ, గౌతమ్‌బాబు పాల్గొన్నారు.