ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: ఈ నెల 7 నుండి 10వ తేదీ వరకు బెంగుళూరులోని బెంగుళూరు సిటీ యూనివర్శిటీలో జరుగనున్న సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల పురుషుల కబడ్డీ పోటీలలో పాల్గొనే డాక్టర్ వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం జట్టును ఎంపికచేసినట్లు వర్శిటీ స్పోర్ట్సు బోర్డు సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈజట్టుకు మేనేజర్‌గా బీమవరం విష్ణు డెంటల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జి.బి.ఎస్. కుమార్ రాజు వ్యవహరిస్తారన్నారు. కోచ్‌గా రాజమండ్రి జిఎస్‌ఎల్ మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డి.వి.వి.ఎస్. శ్రీనివాసరావు వ్యవహరిస్తారని తెలిపారు. జట్టు సభ్యులు: ఎం.శ్రీహరి, వై.వీరహరిప్రసాద్ రెడ్డి, ఎస్.అనిల్‌కుమార్, సి.హెచ్. వెంకట ఉమా చందు, డి.లాల అమరనాథ్, ఎం.సాయి అఖిల్ (జిఎస్‌ఎల్ డెంటల్ కళాశాల - రాజమండ్రి), కె.పెద్దరామయ్య, ఎం.శ్రీకాంత్ (ఎన్‌ఆర్‌ఐ నర్సింగ్ కళాశాల - చినకాకాని), పి.జారుదిన్, ఇ.జ్యోతి ప్రసాద్ జయరామ్ (రంగరాయ మెడికల్ కళాశాల - కాకినాడ), సిహెచ్.మౌలాలి (విఎపిఎంఎస్ కళాశాల - విశాఖపట్నం), పి.సత్య శేషరావు (అనిల్ నీరుకొండ ఎంఎల్‌టి కళాశాల - విశాఖపట్నం) ఎంపికయ్యారు.










