Feb 23,2023 00:17

వినతిపత్రం అందజేస్తున్న హెల్త్‌ అసిస్టెంట్లు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:ఆశ్రమ పాఠశాలలు, జూనియర్‌ కాలేజి, డిగ్రీ కళాశాల వసతి గృహాల్లో గతంలో పని చేసిన హెల్త్‌ అసిస్టెంట్లను రెన్యువల్‌ చేయాలని అరకువేలి ఏటిడబ్ల్యూ కార్యాలయంలో స్ధానిక ఏటిడబ్ల్యూ మల్లికార్జున్‌కు హెల్త్‌ అసిస్టెంట్లు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఆశ్రమ పాఠశాలలు జూనియర్‌ , డిగ్రీ కళాశాల వసతి గృహంలో 2001 సంవత్సరం నుండి గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ప్రాథమిక వైద్యం అందిస్తున్నామన్నారు. హెల్త్‌ అసిస్టెంట్‌ వృత్తిని నమ్ముకుని తమ కుటుంబ జీవనం సాగిస్తూ ఉండేవారమన్నారు. నేటి వరకు హెల్త్‌ అసిస్టెంట్లకు రెవెన్యూ చేయకపోవడంతో ఒక్కసారిగా కుటుంబ జీవనం ఆందోళనకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక వైద్యం విద్యార్థులకు అందిస్తూ నిత్యం రాత్రి పగలు పని చేస్తున్న హెల్త్‌ అసిస్టెంట్లను తక్షణమే రెన్యూవల్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హెల్త్‌ అసిస్టెంట్లకు బకాయి జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.హెల్త్‌ అసిస్టెంట్లు లేక విద్యార్థుల మరణాల సంఖ్య పెరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి పి.బాలదేవ్‌, పి.గంగాధర, పి.లలిత, బి.మోనవత్తి, ఎస్‌.సద్దు, వై.జానకి, టి.బుద్దు, జె నాగమణి, డి.బుజ్జి, వి.నాగేశ్వరావు, సీపీఎం నేత కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.