Oct 17,2023 00:46

మోకాళ్లపై నిరసన తెలుపుతున్న పారిశుధ్య కార్మికులు

ప్రజాశక్తి -ములగాడ : పారిశుధ్య కార్మికులకు ఏడు నెలల హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు వెంటనే చెల్లించాలని జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన సోమవారం శ్రీహరిపురం కోరమండల్‌ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు, సిఐటియు మల్కాపురంజోన్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జివిఎంసి అధికారులు తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. 15రోజుల్లో హెల్త్‌ అలవెన్స్‌, పెండింగ్‌ సమస్యలను పరిష్కరిస్తామని గత నెలలో జివిఎంసి అధికారులు హామీ ఇచ్చి విస్మరించారన్నారు. సమ్మెలో ఇచ్చిన హమీలు దసరాలోపు అమలుచేయకపొతే సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.రాము బి.రాంబాబు, రైల్‌బాబు, వెంకటేష్‌, లోకేష్‌, బంగార్రాజు, కుమార్‌, లక్ష్మి, పాప, లలిత, శ్యామల, రాజేశ్వరి తదితర్లు పాల్గొన్నారు.