
హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-సింహాచలం: సింహాచలం ప్రధాన కూడలి వద్ద హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదాకులకు గోపాలపట్నం ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. వారి వాహనాలను ఆపి హెల్మెట్ వాడకం వల్ల కలిగే ఉపయోగాలను, వాడకపోవడం వల్ల జరిగే నష్టాలను వివరించారు.