Jul 05,2023 21:50

ఫొటో : హెచ్‌ఎంను సన్మానిస్తున్న ఉపాధ్యాయులు

హెచ్‌ఎంగా అనంత లకీë బాధ్యతలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా అనంతలకీë బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్న శేషాద్రి వాసు బదిలీ అయ్యి ఎంఇఒ-1గా మనుబోలుకి వెళ్లారు. ముత్తుకూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బయాలజీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అనంతలకీë ఉద్యోగోన్నతిపై ఆత్మకూరుకు విచ్చేశారు.
అనంతరం సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్కూల్‌ కమిటీ చైర్మన్‌ మల్లికార్జున, ఉపాధ్యాయులు పుల్లయ్య, తెలుగు ఉపాధ్యాయులు ప్రసాద్‌, గుమస్తా శేషయ్య, పిఇటి తిరుపతయ్యలు, హెచ్‌ఎంను ఘనంగా సన్మానించారు.