Aug 08,2023 21:02

పాలకొల్లు :పాలకొల్లు మానవత శాఖ ఆధ్వర్యంలో హెచ్‌ఐవి పిల్లలకు ప్రతి నెలా పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం జరిగింది. మానవత సభ్యులు సిద్ధాని బాలశంకర మల్లేశ్వరరావు తన మనవడు చి.దొడ్డిపట్ల జతిన్‌ పుట్టినరోజు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో మానవత పాలకొల్లు శాఖ డైరెక్టర్స్‌ బోర్డు కన్వీనర్‌ ముత్యాల రామారావు, అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు ధనాని సూర్యప్రకాష్‌, సభ్యులు పాల్గొన్నారు.