ప్రజాశక్తి - జగ్గంపేట
హెచ్‌ఐవి, ఎయిడ్స్‌ను సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కంకణం కట్టాలని ప్రముఖ విద్యా వేత్త, సామాజికవేత్త ఒమ్మి రఘురామ్ అన్నారు. ఆదివారం జగ్గంపేట శాస్ ప్రైవేన్షన్ యూనిట్ ఆధ్వర్యంలో హెచ్‌ఐవి, ఎయిడ్స్ బారినపడి మరణించిన వారి సంస్మరణార్థం కొవొత్తుల ర్యాలీలో నిర్వహించారు. హెచ్‌ఐవి - ఎయిడ్స్ బారినపడిన వారి పట్ల మానవతా దక్పథంతో వ్యవహరించి సహాయ సహకారాలు అందించాలని జగ్గంపేట గ్రామ ఉపసర్పంచ్ బండారు రాజా పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో శాస్ సంస్థ పీడీ యళ్ల పద్మాలత, పిఎం బండారు శైలజ, పలువురు యంఈలు ఏ ఎన్‌ఎన్ పీర్ ఎడ్యుకేటర్స్ గొల్లపల్లి శ్రీను, చెరుకూరి జయరాజ్, ఆకుల శ్రీధర్, నిలపల్లి అప్పారావు, కిలపర్తి వీరబాబు, కపావారపు ప్రసాద్, పచ్చిపులుసు వీరబాబు, కొల్లు ఏసు, గొల్ల ప్రసాద్, కరెడ్ల మణికంఠ, సనబోయిన సత్తిబాబు,ముల్ల మహామద్, ఇసరపు సురేష్,చెరుకూరి రాజ్ కుమార్, కొల్లు సతీష్, దొర సత్తిబాబు, కేటగిరీ రఘు పాల్గొన్నారు. పెద్దాపురం అంతర్జాతీయ ఎయిడ్స్ స్మారక దినోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దాపురం పట్టణంలో వైజ్ సంస్థ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్దాపురం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె.సతీష్‌చంద్రారెడ్డి, బి శ్రీని వాసరావు, వైజ్ ప్రెసిడెంట్ మల్లీశ్వరి, ప్రాజెక్టు డైరెక్టర్ జయ ఉష, సుగంధి తదితరులు పాల్గొన్నారు.
జగ్గంపేటల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులు, పోలీసులు










